![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -507 లో.....వల్లిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి టెస్ట్ లు చేపిస్తానని చెప్పి నర్మద తీసుకొని వెళ్తుంది. ఎక్కడ తన ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపడుతుందోనని భాగ్యానికి సుకన్య ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఇప్పుడు వల్లి కనుక హాస్పిటల్ కి వెళ్తే ప్రెగ్నెంట్ కాదన్నా విషయం తెలిసి మన యాక్టింగ్ బయటపడుతుందని భాగ్యం వాళ్ళకి నేను చెప్పినట్టు చెయ్యండి అని సుకన్య వాళ్లకి ఒక ప్లాన్ చెప్తుంది.
ఆ తర్వాత ధీరజ్ వెళ్తుంటే ప్రేమ ఆపుతుంది. ఒసేయ్ వదలవే అని ధీరజ్ అంటాడు. అప్పుడే ఎదురింట్లో నుండి విశ్వ, సేనాపతి వస్తారు. అది గమనించిన ధీరజ్.. కావాలనే ప్రేమతో క్లోజ్ గా ఉంటాడు. ప్రేమని హగ్ చేసుకుంటాడు. అదంతా విశ్వ, సేనాపతి చూసి కోపంగా చూస్తారు. ఆ విషయం ప్రేమకి అర్థమై మా వాళ్ళు ఉన్నారనే ఎక్సట్రాలు చేసావ్ కదరా అని ప్రేమ అంటుంది. అవునని ధీరజ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు నర్మద స్కూటీపై వల్లిని తీసుకొని వెళ్తుంటే వల్లి టెన్షన్ పడుతుంది
అప్పుడే సుకన్య ఆటో నడుపుతూ వస్తుంది. వాళ్ళ స్కూటీకి ఆక్సిడెంట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే వాళ్ళు హాస్పిటల్ లో ఉంటారు. భాగ్యం, ఆనందరావు, సుకన్య అందరు వల్లి దగ్గరుంటారు. అక్కడ పని చేసే స్వీపర్ ని డాక్టర్ గా యాక్టింగ్ చెయ్యడానికి మెరుపు తీగ అనే ఆవిడని సుకన్య ఒప్పిస్తుంది. మెరుపుతీగ వచ్చి మీకు కడుపు పోయిందని వల్లితో చెప్తుంది. అవునా అని వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయినా కడుపు లేదు కదా ఎలా పోయిందని వల్లి అంటుంది. అదేగా ట్విస్ట్ ఇప్పుడు ఇదే చెప్పాలి.. ఈ స్వీపర్ మెరుపుతీగ అందరు వచ్చాక ఆ విషయం చెప్తుందని సుకన్య అనగానే మరి డాక్టర్స్ వచ్చి తనని గుర్తుపడితే అని వల్లి అనగానే డాక్టర్స్ ఎవరు లేరు అందరు క్యాంపుకి వెళ్ళారని మెరుపుతీగ చెప్తుంది.
ఆ తర్వాత నర్మద దగ్గరికి వేదవతి, ధీరజ్, ప్రేమ వస్తారు. అలా ఎలా అయిందని వేదవతి అడుగుతుంది. ఏమో సడెన్ గా ఆటో వచ్చిందని నర్మద చెప్తుంది. అసలే ఆ వల్లి వట్టి మనిషి కూడా కాదని వేదవతి టెన్షన్ పడుతుంది. అందరు కలిసి వల్లి దగ్గరికి వెళ్తారు. ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని భాగ్యం యాక్టింగ్ చేస్తుంది. నేనున్నాను కదా నా డైలాగ్ నాకు ఉంది చెప్పనివ్వండి అని మెరుపుతీగ అంటుంది. డైలాగ్ ఏంటని ధీరజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |